మద్నూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).
మద్నూర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ వైద్య శిబిరంలో ఎంఎల్‌హెచ్‌పీ బస్వరాజ్, ఆశా కార్యకర్తలు ఈశ్వరీ, మంజాల, రేఖ తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్ ఇందిరానగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం

