Breaking News

అవుట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన

పాల్వంచ, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి).

YTPS AHP, CHP విభాగాలను ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అవుట్‌సోర్సింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ TGPEJAC ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జనరేటింగ్ ప్లాంట్లలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని KTPS VII STGలో ఉద్యోగులు నిరసన చేపట్టారు.

KTPS VII STG చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. YTPS AHP, CHP విభాగాలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించేందుకు జారీ చేసిన టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల్లో ప్రైవేటీకరణ, అవుట్‌సోర్సింగ్ విధానాలను ప్రోత్సహించడం వల్ల ఉద్యోగుల భద్రతతో పాటు సంస్థ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని నాయకులు పేర్కొన్నారు. టెండర్‌ను రద్దు చేయకపోతే జె.ఎ.సి. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామని మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో TGPEJAC నాయకులు రాజేందర్, బ్రహ్మజీ, మహేష్, రాధాకృష్ణ, గిరిధర్, కోటేశ్వరరావు, రాజేష్, నవీన్, మధుబాబు, సంపత్, శ్రీనిధి, లక్ష్మి, శ్రీధర్, సయ్యద్‌తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *