కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు పొదెం వీరయ్య వినతి
భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి).
ఏపీలో విలీనమైన యటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు.బుధవారం భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఐదు గ్రామాలు ప్రస్తుతం ఏపీ పరిధిలో ఉండటంతో భద్రాచలం పట్టణానికి పరిపాలన, పారిశుద్ధ్యం, విద్య, శ్మశాన వాటిక తదితర అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
ముఖ్యంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 900 ఎకరాల భూమి ఏపీ పరిధిలో ఉండటం వల్ల ఆలయ అభివృద్ధి, భూముల పరిరక్షణ, ఆక్రమణల నియంత్రణలో సమస్యలు తలెత్తుతున్నాయని వీరయ్య తెలిపారు.భద్రాచలం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని పొదెం వీరయ్య కేంద్ర మంత్రిని కోరారు.

