అంత్యక్రియల్లో పాల్గొన్న కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
నిజాంసాగర్, ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి).
నిజాంసాగర్ మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ స్వర్గీయ సల్ల ఆశన్న అకాల మరణం పట్ల కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.అనంతరం సల్ల ఆశన్న అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన, పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. చివరి యాత్రలోనూ పాల్గొని తన గౌరవాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, “స్వర్గీయ సల్ల ఆశన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ఈ తీరని విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. పాత్రికేయ రంగానికి, సమాజానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని స్వర్గీయ సల్ల ఆశన్నకు అశ్రునివాళులు అర్పించారు.


