నిజాంసాగర్ సెప్టెంబర్ 2:(E6tv NEWS ప్రతినిధి).
పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు.
జననేత వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏలే మల్లికార్జున్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

