మద్నూర్, ఆగస్ట్ 18: (E6tv NEWS: ప్రతినిధి).
బైక్‌లను దొంగిలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను మద్నూర్ ఎస్ఐ ఏ. మోహన్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దేగ్లూర్‌కు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్లు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని చాకూర్ పోలీసులు వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తెలంగాణలోని మద్నూర్, డోంగ్లీ మండలాల్లో బైక్‌లను దొంగిలించేందుకు ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపారు.
జూలై 28న తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో డోంగ్లీ గ్రామంలో జాదవ్ దీపక్ ఇంటి కాంపౌండ్ గేటు తాళం పగలగొట్టి, ఆవరణలో ఉన్న హోండా షైన్ (TS 16 ET 7946) బైక్‌ను పాత తాళం సహాయంతో దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మార్గమధ్యంలోని హాండేకలూర్ గ్రామంలో దేశ్పేట్వర్ గంగాధర్ ఇంటి ముందు ఉన్న హెచ్ఎఫ్ డీలక్స్ (TS 17 C 4311) బైక్‌ను కూడా దొంగిలించి దేగ్లూర్‌కు తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
ఈ రెండు బైక్‌లను పిట్లం, బిచ్కుంద ప్రాంతాల్లో విక్రయించేందుకు ఆగస్టు 17న వెళ్తుండగా, మద్నూర్ శివారులోని పాత భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎస్ఐ ఏ. మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసు బృందం వారిని పట్టుకుంది. పోలీసు సిబ్బంది విఠల్, శ్రావణ్, సంతోష్‌లు కూడా ఈ పట్టివేతలో పాల్గొన్నారు.నిందితుల నుంచి రెండు దొంగిలించిన బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

