ఇంటింటికీ మొక్కల పంపిణీ
భీంగల్ ఆగస్టు 14: (E6 tv NEWS:T. గంగాధర్).
ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ పట్టణంలోని 7, 8, 9, 10, 11, 12వ వార్డుల్లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్‌పర్సన్ సంటి లత నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ హాజరై మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు.7వ వార్డులో కౌన్సిలర్ అంజుమ్ అలీ, 8వ వార్డులో కౌన్సిలర్ సందీప్, 9వ వార్డులో కౌన్సిలర్ నీలం రవి, 11వ వార్డులో కౌన్సిలర్ సంగ్యా నాయక్, 12వ వార్డులో కౌన్సిలర్ మల్లెల అనుపమ ప్రసాద్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలన్నారు. మొక్కల పెంపకంతో పట్టణంలో పచ్చదనం పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని, స్వచ్ఛమైన గాలి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.వన మహోత్సవంలో భాగంగా ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

