Breaking News

మాదకద్రవ్యాలు, అక్రమ కల్లు రవాణాపై ఎక్సైజ్‌ శాఖ ఉక్కుపాదం

నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా కేసుల నమోదు.. భారీగా గంజాయి, కల్లు స్వాధీనం

వ్యసనాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన, వినియోగదారులకు కౌన్సెలింగ్

నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్).
నిజామాబాద్ జిల్లాలో మాదకద్రవ్యాలు, అక్రమ కల్లు రవాణా, గుడుంబా తయారీపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు DPEO నిజామాబాద్ పరిధిలోని వివిధ SHO పరిధుల్లో NDPS, కల్లు, గుడుంబా తదితర కేసులను నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడంతో పాటు భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్ SHO పరిధిలో..

నిజామాబాద్ SHO పరిధిలో 22 కల్లు శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపగా, 22 మందిని అరెస్టు చేశారు. అక్రమ కల్లు రవాణాకు సంబంధించి 34 కేసులు నమోదు చేసి 29 మందిని అరెస్టు చేశారు. ఈ కేసుల్లో 2,014 లీటర్ల కల్లును సంఘటనా స్థలంలోనే ధ్వంసం చేయడంతో పాటు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించి 12 NDPS కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 28 కిలోల గంజాయి, 4 వాహనాలు, 14 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆర్మూర్ పరిధిలో..

ఆర్మూర్ SHO పరిధిలో 14 కల్లు కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. 1,461 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. 33 కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. అలాగే మూడు NDPS కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేయడంతో పాటు 2 కిలోల గంజాయి, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

బోధన్‌లోనూ చర్యలు..

బోధన్ SHO పరిధిలో 89 కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. అక్రమ కల్లు రవాణాకు సంబంధించి 26 కేసులు నమోదు చేసి 19 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 1,089 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నారు.

భీంగల్‌లో గుడుంబాపై ఉక్కుపాదం..

భీంగల్ SHO పరిధిలో గుడుంబా తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. 139 గుడుంబా కేసులు నమోదు చేసి 94 మందిని అరెస్టు చేశారు. 288 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, గుడుంబా తయారీకి ఉపయోగించే 4,785 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అలాగే మూడు గంజాయి కేసులు నమోదు చేసి 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు కల్లు కేసులు కూడా నమోదు చేశారు.

మోర్తాడ్‌లో కల్లు శాంపిల్స్ సేకరణ

మోర్తాడ్ SHO పరిధిలో 16 కల్లు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం పంపించారు.

వ్యసనాల నివారణకు ప్రత్యేక చర్యలు

మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రైళ్లలో తనిఖీలు నిర్వహించడంతో పాటు గతంలో గంజాయి విక్రయాలకు పాల్పడిన వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. గంజాయి రవాణా, విక్రయాలను అడ్డుకునేందుకు పాత నేరస్తులు, హ్యాబిచువల్‌ అఫెండర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

మాదకద్రవ్యాలు వినియోగించే వారితో పాటు వినియోగదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనుకాకుండా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.వ్యసనాలకు యువత దూరంగా ఉండేలా భవిష్యత్తులోనూ చర్యలను మరింత ఉధృతం చేస్తామని DPEO నిజామాబాద్ అరుణ్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *