బోధన్ కోర్టు సంచలన తీర్పు
సెక్షన్ 498(A) కింద దోషిగా నిర్ధారణ
రూ.500 జరిమానాతో పాటు 3 ఏళ్ల సాధారణ కారాగార శిక్
ఏడపల్లి పోలీసుల దర్యాప్తుకు న్యాయస్థానం మద్దతు
ఏడపల్లి, ఆగస్టు 5: (E6 tv NEWS, రవి నాయక్).
కట్న వేధింపుల కేసులో బోధన్ గౌరవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ ఈ. సాయి శివ కీలక తీర్పు వెలువరించారు. వివాహ సమయంలో కట్నంగా నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నప్పటికీ, అనంతరం మరింత కట్నం తీసుకురావాలని భార్యను శారీరకంగా, మానసికంగా వేధించి బెదిరించినట్లు అభియోగాలు రుజువుకావడంతో నిందితుడు అబ్దుల్ అజీజ్ (A1)ను భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 498(A) కింద దోషిగా నిర్ధారించారు.
కోర్టు నిందితుడికి మూడేళ్ల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది.
ఈ కేసులో అప్పటి యెడపల్లి ఎస్.ఐ. ఎం.డి. ఆసిఫ్ చార్జిషీట్ దాఖలు చేయగా, ప్రభుత్వ తరఫున ఏపీపీ సతీష్ గౌడ్ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు, సమన్వయంలో యెడపల్లి పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు.

