Breaking News

ఆర్య సమాజ్‌లో శ్రావణమాసం ముగింపు మహాయజ్ఞం

మద్నూర్‌, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి)

మద్నూర్‌ మండల కేంద్రంలోని ఆర్య సమాజ్‌లో శ్రావణమాసం ముగింపు సందర్భంగా గురువారం మహాయజ్ఞం నిర్వహించారు. లోకకల్యాణం, ప్రజల సుఖశాంతులు, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఏడాది శ్రావణమాసం ముగింపు అమావాస్య రోజున యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆర్య సమాజ్‌ సభ్యులు తెలిపారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన మహాయజ్ఞంలో ఆర్య సమాజ్‌ సభ్యులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముగింపుగా ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించినట్లు సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అజేయ్‌ తమ్మెవార్‌, ఆర్మూర్‌ హన్మండ్లు, సోపాన్‌రావు, గంపల్‌ లేఖ్‌రాం, రణ్‌వీర్‌, దిగంబర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *