Breaking News

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం

మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి).

తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన పి. నాగభూషణం ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. జగన్ మోహన్ రావు ముదిరాజ్ మంగళవారం నాగభూషణానికి నియామక పత్రాన్ని అందజేశారు.మారుమూల ప్రాంతమైన అంతాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల మద్నూర్ మండల ముదిరాజ్ సంఘ నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నాగభూషణం గత కొంతకాలంగా ముదిరాజ్ సంఘం బలోపేతంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు.ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్‌ల అభివృద్ధి, విద్య, ఉపాధి రంగాల్లో తన వంతు కృషి చేస్తానని, గ్రామస్థాయి నుంచి సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాములు, రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్‌ల అభివృద్ధి, విద్య, ఉపాధి రంగాల్లో తన వంతు కృషి చేస్తానని, గ్రామస్థాయి నుంచి సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాములు, రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *