భీమ్‌గల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి).
ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ భీమ్‌గల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ ఆధ్వర్యంలో భీమ్‌గల్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అరవింద్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు 278 మంది చిన్నారులకు హృదయ సంబంధిత వైద్య సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడిన ప్రాణదాతగా నిలిచారని కొనియాడారు.అదేవిధంగా బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, కార్యకర్తలకు ఆపద వచ్చినప్పుడు ADF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్న గొప్ప నాయకుడు ధర్మపురి అరవింద్ అని పేర్కొన్నారు.ప్రజా సేవే లక్ష్యంగా, కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్‌కు భీమ్‌గల్ మండల బీజేపీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, మరింత ప్రజాసేవ చేసే శక్తిని కల్పించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్, యువ మోర్చా అధ్యక్షులు శెట్టి ప్రేమ్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు నీలం గంగాధర్, దయ్య ప్రవీణ్, కొండ గంగాధర్, బూత్ అధ్యక్షులు బాబురావు, బుదన్న, గంగాధర్, బావన్న, కళ్లేడ గిరిధర్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

