Breaking News

సివిల్స్‌ కొట్టే ఛాన్స్‌.. ఉచిత శిక్షణకు గ్రీన్‌సిగ్నల్‌!

రాజేంద్రనగర్ గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ

రూ.3 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం

ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక.. ఈ నెల 23లోగా దరఖాస్తు

భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి).

సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్‌ సూచించారు.

వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు. అభ్యర్థుల ఎంపికను ప్రవేశ పరీక్ష ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారికి సివిల్స్‌ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించేలా రెసిడెన్షియల్‌ విధానంలో శిక్షణ అందించనున్నట్లు వివరించారు.ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా welfare.sriramsias.com వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పీఓ రాహుల్‌ సూచించారు. ఉచిత శిక్షణ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని సివిల్స్‌లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *