Breaking News

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ అశోక్ పటేల్

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు

రేషన్ సేవల్లో పారదర్శకత పెంచేందుకే స్మార్ట్ కార్డులు

మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. ఆధునిక భద్రతా లక్షణాలతో రూపొందించిన ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ వంటి సదుపాయాలు ఉండటంతో రేషన్ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను సక్రమంగా పరిశీలించుకోవాలని సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్లక్ష్యం జరిగిందని సర్పంచ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పేదల సంక్షేమం కోసం నూతన రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రజా పాలన ద్వారా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ అశోక్ పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరస్వర్ సాయిలు, మీర్జాపూర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్, సొసైటీ మాజీ చైర్మన్ గంగన్న, డిప్యూటీ తహసీల్దార్ ఖలేద్, ఉప సర్పంచ్, గ్రామ మైనారిటీ అధ్యక్షుడు నిసార్, మోసిన్, సబడే చందర్, సాయిబాబా, గ్రామ పంచాయతీ కార్యదర్శి హరీష్‌కుమార్, కాంధార్ మారుతి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *