మద్రాస్ తండలో జెండా ఆవిష్కరణ.. బంజారా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలి
టేకులపల్లి, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి).
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండ గ్రామంలో సేవాలాల్ సేన 12వ వార్షికోత్సవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు.సేవాలాల్ సేన సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ వినోద్ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు శివ నాయక్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ కృష్ణ నాయక్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాందాస్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సేవాలాల్ సేన ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు సాధించిన విజయాలను స్మరించుకున్నారు. బంజారా, గిరిజనుల సమస్యల పరిష్కారానికి సేవాలాల్ సేన నిరంతరం పోరాటం చేస్తోందన్నారు.
సేవాలాల్ సేన ఆధ్వర్యంలో తండాలను గ్రామ పంచాయతీలుగా సాధించడం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ సాధన, సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేలా కృషి చేయడం, ‘పోడుకు తోడు’ పాదయాత్ర ద్వారా గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందించేందుకు ఉద్యమించడం, ఏజెన్సీ డీఎస్సీ ద్వారా వందలాది మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయడం వంటి పలు కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.రాబోయే రోజుల్లో బంజారా, గిరిజన జాతి ఎదుర్కొనే సమస్యలను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సేవాలాల్ సేనను మరింత బలోపేతం చేసి గిరిజనుల హక్కుల సాధన కోసం ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో లాల్ చంద్ నాయక్, రాకేష్ నాయక్, చిన్న నాయక్, హీరాలాల్ నాయక్, నాగేష్ నాయక్, వినోద్ నాయక్, బగ్గు నాయక్, భీముడు నాయక్, రాము సాదు, రమేష్ నాయక్, సాములు నాయక్, రాంజీ నాయక్, దాసు నాయక్, మంగీలాల్ నాయక్, సందీప్ నాయక్, పవన్ నాయక్, లోకేష్ నాయక్, రామ్ కుమార్, గంగానాయక్, రాజు, బాలు నాయక్, శ్రీకాంత్ నాయక్, సాయి నాయక్తో పాటు గ్రామ పెద్దలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

