Breaking News

మద్నూర్‌లో 27 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకా

గర్భాశయ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఎంతో కీలకం: డా. శ్రీలేఖ

మద్నూర్ ఆగస్టు 5:(E6 tv NEWS, M. మస్నాజీ)

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 27 మంది బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) టీకా అందించినట్లు మండల వైద్యాధికారి డా. శ్రీలేఖ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ టీకా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె వివరించారు.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని సూచించారు. వ్యాక్సినేషన్ ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ప్రభుత్వం చేపడుతున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని మండల వైద్యాధికారి డా. శ్రీలేఖ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *