Breaking News

భద్రాద్రి జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా అనూష

అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అంకిత్

కొత్తగూడెం, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారిణి, గ్రూప్-1 అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించిన నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అనూషను నోడల్ అధికారిణిగా నియమించినట్లు అధికారులు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడంతో పాటు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికల రూపంలో అందించాల్సి ఉంటుందని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కాగా, ప్రస్తుతం జిల్లా పర్యాటక అధికారిగా విధులు నిర్వహిస్తున్న పరాధామ రెడ్డి ఇకపై జిల్లా యువజన, క్రీడల అధికారిగా కొనసాగనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *