*మూడు రోజుల్లో 1,92,470 మంది చిన్నారులకు పోలియో చుక్కలు*
*ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేసిన వైద్య సిబ్బంది*
*కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ డీఎంహెచ్వో అభినందనలు*
నిజామాబాద్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మూడో రోజు బూత్ల వద్ద పోలియో చుక్కలు వేయించని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, ఎన్సీసీ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించారు.
మొదటి రోజు 1,91,883 మంది అర్హులైన చిన్నారుల్లో 1,80,596 మందికి (94 శాతం) పోలియో చుక్కలు అందించగా, రెండో రోజు మిగిలిన 11,282 మందిలో 9,264 మందికి చుక్కలు వేశారు. మూడు రోజుల వ్యవధిలో మొత్తం 1,92,470 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించి 100.31 శాతం లక్ష్యాన్ని సాధించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, ఎన్సీసీ వాలంటీర్లు, నర్సింగ్ విద్యార్థినులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అభినందనలు తెలిపారు.
- Adilabad
- Hyderabad
- Karimnagar
- Khamam
- Mahaboobnagar
- Medak
- Medchal
- Nalgonda
- News
- Nizambad
- Ranga Reddy
- Telangana
- Warangal
- You Tube
నిజామాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం – 100.31 శాతం లక్ష్యం పూర్తి*

