జూన్ 3: E6 న్యూస్ (శివ ఠాకూర్)
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి భక్త వత్సలం, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గణేష్, వినోద్, కిష్టా గౌడ్, వాహీద్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

