Breaking News

నిర్ణీత గడువులోగా ఆలయపుణ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పనుల పరిశీలన

భక్తులకు ఇబ్బందులు లేకుండా బాలాలయంలో అన్ని వసతులు కల్పించాలి

భైంసా సబ్ కలెక్టర్ ఆదేశం

బాసర జూలై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భైంసా సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం బాసర మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో కొనసాగుతున్న పునర్నిర్మాణ పనులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతి వివరాలను దేవస్థాన ఏఈఓ గంగా శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు.

పనుల్లో వేగం పెంచాలి

ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ సూచించారు. పనుల నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. నిర్మాణ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు.

భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం

ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. బాలాలయంలో భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని, దర్శన ఏర్పాట్లు సజావుగా కొనసాగేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ పవన్ చంద్ర, ఆలయ ఏఈఓ గంగా శ్రీనివాస్, సూపరింటెండెంట్లు, దేవస్థాన సిబ్బంది, దాత సంబంధీకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *