కుటుంబ సభ్యుల ఫారాలను బీఎల్ఏ, బీఎల్ఓ, సూపర్వైజర్లకు అందజేత
మోర్తాడ్, జూలై 11: E6 న్యూస్ శివ ఠాకూర్ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రజలు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించి ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు సహకరించాలని కోరారు.
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ముందుగా స్వయంగా ఈ ప్రక్రియలో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. SIR ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు బీఎల్ఓలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఎల్ఏలు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

