జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్
నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ కు ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం ద్వారా జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, చాలా మంది జర్నలిస్టులు స్వల్ప వేతనాలతో కుటుంబాలను పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్, జిల్లా నాయకులు మధు, అనిత, ప్రవీణ్, అఖిల్, రాజు, కృష్ణ, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, సురేష్, లక్ష్మణ్, ఆనంద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
అందువల్ల ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 100 శాతం రాయితీ కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

