మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
మాక్లూరు, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్
మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. బీజేపీ నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఆయన బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఒడ్డెట్పల్లి, అమ్రాద్, బోర్గం, మాణిక్బండారు, గొట్టుముక్కల, మంతాపూర్ గ్రామాల్లో మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, కష్టసమయంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. అవసరమైతే వైద్య చికిత్సతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. వైద్య చికిత్సకు సంబంధించిన ఎలాంటి అవసరం వచ్చినా తనను నేరుగా సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెండవ డివిజన్ కార్పొరేటర్ మోహన్, మాజీ ఎంపీటీసీ వడ్డెన్న, ఒడ్డెట్పల్లి సర్పంచ్ సత్యం, ముల్లంగి సర్పంచ్ ధర్మపతి, ధర్మారం సర్పంచ్ శ్రీనివాస్, మామిడిపల్లి రాజేందర్ రెడ్డి, గొట్టుముక్కల సంజీవ్, రమేష్ నాయక్, రాజేశ్వర్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

