మహాధర్నా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడం సిగ్గుచేటు: కాంగ్రెస్ నాయకుడు కొట్టం మనోహర్
కోటగిరి, జూలై 16 : E6 న్యూస్ అశోక్ కాంబ్లే
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పదేళ్ల పాలనలో బాన్సువాడ నియోజకవర్గం, కోటగిరి మండల ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ ప్రశ్నించారు. మహాధర్నా పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆయన అన్నారు.కోటగిరి మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పదేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేసి హామీల అమలుకు కట్టుబడి ఉందని అన్నారు.
రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పోచారం
రైతుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొట్టం మనోహర్ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అని కొనియాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అలాంటి రాజకీయాలకు తగిన సమాధానం ప్రజలే ఇస్తారని ఆయన హెచ్చరించారు.

