Breaking News

భారత్ అంతరిక్ష రంగంలో మరో చరిత్ర… విక్రమ్-1 విజయంతో కొత్త శకం!

న్యూఢిల్లీ / శ్రీహరికోట, జూలై 18: E6 tv NEWS.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)సహకారంతో భారత ప్రైవేట్ స్పేస్ రంగం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 (Vikram-1) రాకెట్ విజయవంతంగా ప్రయోగమై కక్ష్యలోకి చేరింది. భారత ప్రైవేట్ రంగం నుంచి కక్ష్యలోకి చేరిన తొలి ఆర్బిటల్ రాకెట్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయాన్ని “ఆత్మనిర్భర్ భారత్‌కు మరో నిదర్శనం”గా అభినందించారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)సహకారంతో భారత ప్రైవేట్ స్పేస్ రంగం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 (Vikram-1) రాకెట్ విజయవంతంగా ప్రయోగమై కక్ష్యలోకి చేరింది. భారత ప్రైవేట్ రంగం నుంచి కక్ష్యలోకి చేరిన తొలి ఆర్బిటల్ రాకెట్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయాన్ని “ఆత్మనిర్భర్ భారత్‌కు మరో నిదర్శనం”గా అభినందించారు.

గగన్‌యాన్ మిషన్‌లో కీలక ముందడుగు

భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి క్రూ మాడ్యూల్ భద్రతా వ్యవస్థలపై మరో మూడు కీలక అర్హత పరీక్షలను ISRO విజయవంతంగా పూర్తి చేసింది. స్ప్లాష్‌డౌన్ రికవరీ, మాడ్యూల్ వేర్పాటు, పారాచూట్ వ్యవస్థల పనితీరును ఈ పరీక్షల్లో ధృవీకరించారు. ఇవి భారత తొలి వ్యోమగాముల భద్రతకు అత్యంత కీలకమైనవి.

స్పేస్ మెడిసిన్‌లో కొత్త భాగస్వామ్యం

భవిష్యత్ మానవ అంతరిక్ష యాత్రలకు అవసరమైన బయోఆస్ట్రోనాటిక్స్ మరియు స్పేస్ మెడిసిన్ పరిశోధనల కోసం ISRO, SCTIMSTతో కలిసి పనిచేయనుంది. అంతరిక్షంలో మనిషి ఆరోగ్యంపై పరిశోధనలకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది.

శాస్త్రవేత్తల నిలుపుదలపై చర్యలు

గగన్‌యాన్ వంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనాములు పెరుగుతున్న నేపథ్యంలో, అంతరిక్ష శాఖ రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలపై కొత్త నియంత్రణ నిబంధనలు అమలు చేసింది. ప్రధాన ప్రాజెక్టులకు అంతరాయం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *