హైదరాబాద్ (ఈ6టివి వెబ్ న్యూస్):
నిజాంపేట సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ లీల సుందరయ్య భవన్ వేదికగా మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఆల్విన్ మాజీ ఉద్యోగ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో… బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, రెనోవా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మరియు రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్ సంయుక్త సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అసోసియేట్ డైరెక్టర్ కల్పనా రఘునాథ్, ఈఎస్ఐ హాస్పిటల్ (ఆర్సీ పురం) సూపరింటెండెంట్ ఎం. రమేష్ బాబు హాజరయ్యారు.
తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ నయం సాధ్యం: నిపుణులు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. బసవతారకం హాస్పిటల్ ఆధ్వర్యంలో నిరంతరం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ క్యాన్సర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
“క్యాన్సర్ అనగానే భయపడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండకూడదు. ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే నయం చేయడం చాలా సులభం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇప్పటికే వేలాది మంది క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.” అని వారు పేర్కొన్నారు.
భారీగా తరలివచ్చిన రోగులు..
ఈ మెగా హెల్త్ క్యాంప్‌లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, రెనోవా హాస్పిటల్స్ నిపుణులైన వైద్య బృందం పాల్గొని, స్థానికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ వైద్య శిబిరంలో మాజీ ఆల్విన్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జే. మల్లికార్జునరావు, జనరల్ సెక్రటరీ వీ. రమేష్, వైస్ ప్రెసిడెంట్ జి. సురేష్, ఆర్. సతీష్ బాబు, కార్యనిర్వాహక సభ్యులు మహమ్మద్ నవి, కృష్ణంరాజు, వి.వి. రావు, ఎస్. బలవంత్ రెడ్డి, కే. రాములు, ట్రెజరర్ జి. రాములు, సంఘ సభ్యులు లక్ష్మణరావు, నారాయణ గౌడ్, బంగారి భాస్కర్, వెంకట్రావు, నాగరాజు, శ్రీనివాసరావు, రమేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మెగా ఉచిత వైద్య శిబిరం: ప్రగతి నగర్లో ఆల్విన్ మాజీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

