Breaking News

చాగంటి రాకతో రూరల్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణం

ప్రవచన చక్రవర్తికి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హృదయపూర్వక స్వాగతం

నిజామాబాద్, జూలై 23: E6 tv NEWS (శివ ఠాకూర్).

ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ నెల 24న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి విచ్చేయనున్న సందర్భంగా ఆయనకు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో బోర్గాం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిర్వహించనున్న “గోమాత వైభవం” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న చాగంటి కోటేశ్వరరావు రాక ప్రజలకు ఆధ్యాత్మిక పండుగ వంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు లక్షలాది మంది జీవితాల్లో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని అన్నారు. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, భక్తి, సేవ, మానవతా సందేశాలను ఆయన సరళమైన శైలిలో ప్రజలకు చేరవేస్తూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నారని కొనియాడారు.

ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో బోర్గాం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిర్వహించనున్న “గోమాత వైభవం” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న చాగంటి కోటేశ్వరరావు రాక ప్రజలకు ఆధ్యాత్మిక పండుగ వంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు లక్షలాది మంది జీవితాల్లో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని అన్నారు. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, భక్తి, సేవ, మానవతా సందేశాలను ఆయన సరళమైన శైలిలో ప్రజలకు చేరవేస్తూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నారని కొనియాడారు.

చాగంటి కోటేశ్వరరావు తమ నియోజకవర్గానికి రావడం గర్వకారణమని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన ప్రవచనాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, సోదరభావం, సామాజిక ఐక్యత మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అలాగే గోమాత సంరక్షణ, భారతీయ సనాతన సంప్రదాయాల పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సమేతంగా “గోమాత వైభవం” కార్యక్రమానికి హాజరై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను ఆలకించి ఆధ్యాత్మిక స్ఫూర్తిని పొందాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు.గోమాత ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడి పశువులు అభివృద్ధి చెందాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *