కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్లో మహాధర్నా
ముధోల్, జూలై 24: E6 tv NEWS తిరుపతి గౌడ్.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించారు.
ఏఐసీసీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పోతన్న యాదవ్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయించడం అత్యంత అమానుష చర్య అని విమర్శించారు. లీకేజీకి కారణమైన వారిని కాపాడేందుకే విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలిచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.
ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ముధోల్ మండల అధ్యక్షుడు కిష్టయ్య, స్థానిక సర్పంచ్ షబానా ఏజాజుద్దీన్, మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, మాజీ జెడ్పీటీసీ సూర్యం రెడ్డి, బషీర్, మాజీ సర్పంచులు రాంరెడ్డి, గౌతమ్, నాయకులు వంశీ నాగేష్, సుధాకర్, విఠల్ కంబ్లే, సామీ, శ్రీనివాస్ గౌడ్, విశ్వంబర్, విఠల్ మాగ్ధహోమ్, సాయినాథ్, సాయిరాం, పాషాబాయి, సాహెబ్ రావు, అమృత్తో పాటు పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

