- ఆషాఢ శుద్ధ ఏకాదశి పవిత్రతను గుర్తుచేసిన టీపీసీసీ అధ్యక్షులు
- ధర్మం, సత్యం, సేవాభావం ప్రతి కుటుంబంలో వెల్లివిరియాలని ఆకాంక్ష
- శ్రీమహావిష్ణువు కటాక్షంతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్ష
జూలై 25: E6 tv NEWS ప్రతినిధి.
ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా జరుపుకునే పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం ఉండటంతో భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందుతారని తెలిపారు.ధర్మం, సత్యం, సేవాభావం, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందాలను నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవం, ఐక్యత మరింత బలోపేతం కావాలని కోరుకున్నారు.
శ్రీమహావిష్ణువు కటాక్షంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తొలి ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకుని, ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.

