జుక్కల్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ).
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోడ గడియారాలను సోమవారం పంపిణీ చేశారు.జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఈ గోడ గడియారాలను అందజేసినట్లు గ్రామ సర్పంచ్ వి. రమణా సురేష్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బి. అనిల్, వార్డ్ సభ్యులు మహాదేవి, హైదర్, నాగనాథ్, షాదుల్, గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్ కన్నా, గ్రామపంచాయతీ సిబ్బంది గంగారం, వీరేశం, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.గృహప్రవేశం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం అందించిన గోడ గడియారాలను స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ అందిస్తున్న సహకారం అభినందనీయమని వారు పేర్కొన్నారు.


