Breaking News

వన్నెల్ బిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలి..

ఆరు నెలల పాటు తల్లిపాలే ఉత్తమ ఆహారం: నిపుణులు

బాల్కొండ, ఆగస్టు 4: E6 TV NEWS (తాటికొండ గంగాధర్)
బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బక్కూరి వినోద ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం ఎంతో అవసరమని, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి, ఎదుగుదలకు అత్యంత కీలకమని తెలిపారు.

ఐసీడీఎస్ సూపర్వైజర్ రేవతి మాట్లాడుతూ, ముర్రుపాలు శిశువుకు జీవితాంతం వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయని, ఆరు నెలల అనంతరం అనుబంధ పోషకాహారం ప్రారంభించాలని సూచించారు. ప్రతి నెల పిల్లల బరువు, ఎత్తు కొలిచి వారి పోషకాహార స్థితిని పర్యవేక్షించాలని లబ్ధిదారులకు సూచించారు.అంగన్వాడీ టీచర్లు గర్భిణులు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ప్రతిరోజూ అందించే సంపూర్ణ భోజనాన్ని వినియోగించుకోవాలని, ప్రతి నెల పిల్లల బరువు తప్పనిసరిగా తూకం వేయించుకోవాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పిల్లలకు నిర్ణీత సమయానికి అన్ని టీకాలు వేయించడంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్కూరి వినోద, ఐసీడీఎస్ సూపర్వైజర్ రేవతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్, అంగన్వాడీ టీచర్లు శారద, రాణి, విజయ, గోదావరి, ఆశా వర్కర్లు లత, స్వప్న, లక్ష్మి, జ్యోతి, గర్భిణులు, బాలింతలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *