Breaking News

రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు

అన్నదానం, విద్యార్థులకు పుస్తకాలు–పెన్నుల పంపిణీ

ఆర్భాటాలకు దూరంగా సమాజ సేవతో జన్మదిన వేడుకలు

రాజేష్ ఠాకూర్ సేవా దృక్పథాన్ని కొనియాడిన బీజేపీ నాయకులు

జమ్మికుంట,ఆగస్టు 5: (E6 tv NEWS ప్రతినిధి).

బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో బీజేపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆర్భాటాలకు దూరంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా జమ్మికుంటలోని బొమ్మల గుడి వద్ద అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప దానం మరొకటి లేదని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.అనంతరం జమ్మికుంటలోని ఆబాది ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, రాజేష్ ఠాకూర్ ఎల్లప్పుడూ సమాజ సేవకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, పార్టీ బలోపేతంతో పాటు పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొలకాని రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, పార్టీ నాయకులు కొమురయ్య, రాకేష్ ఠాకూర్, అడువల శ్రీధర్, రాయబారపు సురేష్, రామంచ రాజేష్, గణేష్, అదులపురం శ్రీనివాస్తో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సేవా దృక్పథంతో నిర్వహించిన ఈ కార్యక్రమాలు స్థానిక ప్రజల ప్రశంసలు అందుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *