Breaking News

నూతన పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశం వినియోగించుకోవాలని విజ్ఞప్తి

దరఖాస్తు అనంతరం తప్పనిసరిగా రసీదు భద్రపరచుకోవాలని సూచన

ముధోల్, ఆగస్టు 7: E6 tv NEWS (ఆకుల తిరుపతి గౌడ్).

ముధోల్ నియోజకవర్గంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల నూతన పెన్షన్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పెన్షన్ మంజూరు కోసం ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను పూర్తిగా తెలుసుకుని, సంబంధిత దరఖాస్తు ఫారాన్ని సక్రమంగా నింపి, అవసరమైన ధ్రువపత్రాలను జత చేసి సంబంధిత మండల ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.దరఖాస్తు సమర్పించిన అనంతరం తప్పనిసరిగా రసీదు (Acknowledgement) తీసుకుని భద్రపరచుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి ఆ రసీదు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అర్హులైన ఒక్కరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా వెంటనే దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *