కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య
కమ్మర్పల్లి, ఆగస్టు 8: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్).
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య అన్నారు. శుక్రవారం కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో అరకొరగా పెన్షన్లు అందేవని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయూత పథకం ద్వారా అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, పైలేరియా, డయాలసిస్ బాధితులు తదితర అర్హులు పెన్షన్ కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శికి లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా ఇళ్లు లేని పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హులైన కుటుంబాలు ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందని వారు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, వీసీ చైర్మన్ బుచ్చన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, జిల్లా కిసాన్ ఖేత్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జేడీ శ్రీనివాస్, కొత్తూరు సర్పంచ్ నలిమెల గంగారెడ్డి, ఉప సర్పంచ్ మనోహర్, అమీర్నగర్ సర్పంచ్ దశరథ్, బోనగిరి లక్ష్మణ్ ,గ్రామ శాఖ అధ్యక్షులు సాల్లూరి గణేష్, శ్రీకాంత్, భూమారెడ్డి, రవీందర్ రెడ్డి, నర్ర భూమేష్, మహేందర్తో పాటు మండల కార్యదర్శులు ఆలకొండ రాజేష్, పుప్పాల నర్సయ్య, తక్కూరి రాజశేఖర్, గోపిడి లింగారెడ్డి, కొమ్ముల రవీందర్, రాజుల రమేష్, మహేందర్ గౌడ్, బుచ్చిమల్లయ్య, రాజేంద్ర ప్రసాద్, జగదీష్, ముకేం నరేందర్, బాలయ్య, నరేష్, బైండ్ల శ్రీనివాస్, చౌటుపల్లి రిత్విక్, కుండేటి శ్రీను, వినీల్, సంపంగి నాగరాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


