బిచ్కుంద, ఆగస్టు 9: (E6 tv NEWS ప్రతినిధి).
టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన గులని సాయిలును బిచ్కుందలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన గులని సాయిలు టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం సామాజిక వర్గానికి మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శాఖాపూర్ తుకారం (సర్పంచ్), సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు సూర్యవంశీ యాదవ్, సీనియర్ రిపోర్టర్ జాదవ్ వీరన్న, మీరెవరు సాయిలు, భుజం సార్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు విజయ్, పెద్ద కోడ్పగల్ మండల అధ్యక్షుడు సర్వగల రవీందర్, బోడికే హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.గులని సాయిలుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో సామాజిక న్యాయం కోసం మరింతగా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.


