Breaking News

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి

మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).
మద్నూర్ మండల ప్రజలందరూ ఈ నెల 16వ తేదీన జరిగే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకకు భారీ సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించాలని మద్నూర్ సర్పంచ్ సంతోష్ మేస్త్రి కోరారు.కందర్‌పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు.

మద్నూర్ మండల ప్రజలు కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుటుంబానికి తమ శుభాకాంక్షలు తెలియజేయాలని సర్పంచ్ సంతోష్ మేస్త్రి విజ్ఞప్తి చేశారు.వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *