Breaking News

అభిమానంతో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర

మద్నూర్ మీదుగా తమిళనాడుకు వెళ్తున్న మహారాష్ట్ర అభిమాని యాదవ్ హెగ్డోలే

మద్నూర్ ఆగస్టు 11: (E6 tv NEWS: M. మస్నాజీ).
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ దళపతి పట్ల ఉన్న అభిమానంతో మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని సుమారు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ మండలం షెల్గవ్ గ్రామానికి చెందిన యాదవ్ హెగ్డోలే తన అభిమాన నాయకుడిని స్వయంగా కలిసి అభినందించాలనే ఆశయంతో పాదయాత్రగా తమిళనాడు బయలుదేరారు.

విజయ్ దళపతి ముఖ్యమంత్రి కావాలన్న తన కోరిక నెరవేరడంతో, తన మనసులోని అభిమానాన్ని చాటుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు యాదవ్ హెగ్డోలే తెలిపారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన ప్రయాణించి తమిళనాడు చేరుకుని ముఖ్యమంత్రి విజయ్ దళపతిని కలవడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ క్రమంలో మద్నూర్ మీదుగా వెళ్తున్న యాదవ్ హెగ్డోలేను స్థానిక అభిమానులు, నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆశయం నెరవేరాలని, సురక్షితంగా తమిళనాడు చేరుకుని విజయ్ దళపతిని కలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్సీటీ వినోద్ కుమార్, అస్లాం, అనిల్ పటేల్, విజయ్ శరళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *