Breaking News

బిచ్చుకుంద డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం

బిచ్చుకుంద, ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి).

బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ప్రేమ, మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు తదితర సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్చుకుంద ఎస్‌ఐ జి. రాజు సూచనలతో ఏఎస్ఐ డి. దేవరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కళాబృందం సభ్యులు మాటలు, పాటల ద్వారా విద్యార్థినులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930కు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం కోసం 1908కు, మహిళల భద్రత కోసం షీ టీమ్ 8712686094కు, అత్యవసర పరిస్థితుల్లో 100/112కు ఫోన్ చేయాలని సూచించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికలను జాగ్రత్తగా ఉపయోగించాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు మంచి లక్ష్యంతో చదువుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, చిన్నపాటి తప్పిదాలు సైతం జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు ఇచ్చే సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. సాయిలు, బాన్సువాడ షీ టీమ్‌కు చెందిన పీసీ అనిల్, డబ్ల్యూపీసీ జి. పార్వతి, కళాశాల ప్రిన్సిపాల్ కోర్రి అశోక్, అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *