Breaking News

డోంగ్లి ప్రధాన రహదారికి మరమ్మతులు

డోంగ్లి ఆగస్టు 13: (E6 tv NEWS, ప్రతినిధి).

కామారెడ్డి జిల్లా డోంగ్లి గ్రామంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు, గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రహదారిపై ఏర్పడిన గుంతలను కాంక్రీట్ మిక్సర్‌ సహాయంతో మిశ్రమాన్ని పోసి పూడ్చే పనులు కొనసాగుతున్నాయి.

ఈ మరమ్మతు పనులను డోంగ్లి తహసీల్దార్ రంజిత్ కుమార్ పరిశీలించారు. రహదారి మరమ్మతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, సక్రమంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టడంతో వాహనదారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది సాయిబాబా, గ్రామ నాయకులు విలాస్ పటేల్, పంచాయతీ కార్యదర్శి సవాయి సింగ్, వార్డు సభ్యుడు రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *