Breaking News

పెన్షన్ల కోసం ప్రత్యేక క్యాంపు

నిర్మల్ ఆగస్టు 14: (E6 tv NEWS ప్రతినిధి).

నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లోని ఈడెన్ గార్డెన్‌లో స్థానిక కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ క్యాంపు ద్వారా అవగాహన కల్పించారు.అర్హులైన ప్రజలు తమ ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులతో క్యాంపునకు వచ్చి అవసరమైన వివరాలు సమర్పించాలని కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా కోరారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఈ నెల 31వ తేదీలోగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

క్యాంపు వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, వితంతువులు, వృద్ధులు, పెన్షన్‌దారులు పాల్గొని తమ వివరాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా రిపోర్టర్: ఎండి అమీరుద్దీన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *