కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి)
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వివిధ విభాగాలు, సెల్ల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.



