దేశ ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి: జుక్కల్ ఎమ్మెల్యే
జుక్కల్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి).
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
మున్సిపాలిటీ సిబ్బందికి రెయిన్కోట్లు పంపిణీ
అనంతరం బిచ్కుంద మున్సిపాలిటీలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బందికి రెయిన్కోట్లు పంపిణీ చేశారు. వర్షాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బందిని అభినందించారు.



