బాల్కొండ ఆగస్టు 15: (E6tv NEWS: T. గంగాధర్).
బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్మరించుకున్నారు. వారి త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ జెండాకు వందనం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.


