Breaking News

ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి బయలుదేరిన మల్లాపూర్ గ్రామ ప్రజలు

డోంగ్లీ, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి).

కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామం నుంచి జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారి కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు గ్రామ ప్రజలు ఆదివారం బయలుదేరారు.ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారి కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించేందుకు మల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన దంపతుల జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.గ్రామం నుంచి ప్రజలు సమూహంగా వివాహ వేడుకలకు బయలుదేరడంతో మల్లాపూర్‌లో సందడి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *