Breaking News

బాడాపహాడ్ కమాన్ నిర్మాణానికి భూమి పూజ

వర్ని, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి)

వర్ని మండల కేంద్రంలోని బాడాపహాడ్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించనున్న బాడాపహాడ్ కమాన్ (స్వాగత తోరణం) నిర్మాణ పనులకు మాజీ డీసీసీబీ చైర్మన్  పోచారం భాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు.స్థానిక నాయకులతో కలిసి ఆయన కమాన్ నిర్మాణ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. బాడాపహాడ్ చౌరస్తా వద్ద నిర్మించనున్న ఈ స్వాగత తోరణం వర్ని పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వర్ని మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డికి పలువురు నాయకులు, ప్రజలు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *