నిర్మల్, ఆగస్టు 18: (E6tv NEWS:A. తిరుపతి గౌడ్)
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గౌడ సంఘాల నాయకులు, వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రతినిధులు పాల్గొని సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి దండు శ్రీనివాస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ వేముల శ్రీనివాస్, డీవీసీడీవో సత్యనారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ మాట్లాడుతూ.. దాదాపు 400 సంవత్సరాల క్రితమే బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం మొగల్ పాలకుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సర్వాయి పాపన్న పోరాడారని అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన పాపన్న.. పేదల పక్షాన నిలిచి, అన్యాయమైన పన్నుల విధానాలకు వ్యతిరేకంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి ఉద్యమించారని పేర్కొన్నారు.సర్వాయి పాపన్న అనేక కోటలను జయించి గోల్కొండను పరిపాలించిన మహారాజుగా చరిత్రలో నిలిచారని వారు అన్నారు. దేశంలోనే బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడిన తొలి విప్లవ వీరుల్లో పాపన్న ఒకరని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి కారణంగానే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దిశగా మార్గదర్శకత్వం లభించిందన్నారు.సర్వాయి పాపన్న ఆశయాలను సాధించి, బడుగు బలహీన వర్గాలకు సామాజిక, రాజకీయ న్యాయం కల్పించేందుకు కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. రంగస్వామి, సబ్ఇన్స్పెక్టర్ కె. అభిషేకర్, మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు పడాల రాజేందర్ గౌడ్, తీగల వెంకట్ గౌడ్, కొండ బాల గౌడ్, జిల్లా నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, యాగండ్ల దశ గౌడ్, కొండ మురళి గౌడ్, తిరుపతి గౌడ్, టీ. కుమార్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, గంగాధర్ గౌడ్, దేవేందర్ గౌడ్, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌడ కులస్తులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు సర్వాయి పాపన్నకు నివాళులర్పించారు.

