Breaking News

ఎంపీడీఓ సాయిలును సన్మానించిన మెనూర్ సర్పంచ్

మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి).

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పి. సాయిలును మెనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీడీఓ పి. సాయిలు మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. మద్నూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల సహకారంతో అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి హరీష్ కుమార్, గ్రామస్తులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *