పిట్లం, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి)
దివంగత నేత, భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సాంకేతికతకు బాటలు వేసి భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కంప్యూటర్ విప్లవానికి నాంది పలికి, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ, యువతకు ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి పునాది అని విశ్వసించిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన కలల భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి, జొన్న మోహన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శపథం రెడ్డి, గ్రామ సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ మిర్జా అవేజ్ బేగ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమ్రోజ్, నాయకులు భాస్కర్ యాదవ్, నవీన్ ముదిరాజ్, అశోక్, దయానంద్, బల్రాజ్, బాలకృష్ణ, హన్మాండ్లు, ఇమ్రాన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

