నిజాంసాగర్, ఆగస్టు 20:(E6tv NEWS: ప్రతినిధి)
బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి నిల్వలు, ఇన్ఫ్లో, ప్రస్తుత నీటి పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు పరిస్థితి, సాగునీటి అవసరాలపై అధికారులతో చర్చించారు. ప్రస్తుత నీటి లభ్యత, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి సరఫరాపై సమీక్షించినట్లు తెలిపారు.రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ప్రాజెక్టు నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయకట్టు రైతులకు అవసరమైన మేరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
- Breaking News
- E6TV Special Storys
- Hyderabad
- Medak
- News
- Nizambad
- Ranga Reddy
- Sports
- Telangana
- Warangal
- You Tube
నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన పోచారం

