మద్నూర్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి).
మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ ముజీబ్, ఎంపీవో సత్యనారాయణరెడ్డితో పాటు విద్యాశాఖ, పంచాయతీరాజ్, నీటిపారుదల, అటవీ, విద్యుత్, ఉపాధిహామీ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.ప్రజావాణిలో మేనూర్ గ్రామానికి చెందిన ఒక వినతిని స్వీకరించినట్లు ఎంపీడీవో సాయిలు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు.

